
ప్రపంచంలోని టాప్ కంపెనీలు హైదరాబాద్ లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయని ఐటీ మినిస్టర్ కేటీఆర్ అన్నారు. టీఎస్ఐఐసీ బయోటెక్ పార్క్ లో ఫెర్రింగ్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మహిళల హెల్త్ కేర్ ఉత్పత్తుల్లో హైదరాబాద్ టాప్ ప్లేసులో ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానం గొప్పగా ఉండటం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీ నడుస్తుందన్న ఆయన.. తన అమెరికా టూర్ వల్ల హైదరాబాద్ కు రూ. 7500 కోట్ల పెట్టుబడులు రానున్నాయని అన్నారు.