పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

మేడ్చల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి జవహర్నగర్ మున్సిపాలిటీలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హెచ్ఎండీఏ చేపట్టిన చిన్నాపురం చెరువు సుందరీకరణతో పాటు జలమండలి చేపట్టిన ఫేజ్ 2 పనులను ప్రారంభించారు.వెజ్, నాన్ వెజ్ మార్కెట్లతో పాటు గ్రేవ్ యార్డ్, రోడ్డు వెడల్పు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. జవహర్ నగర్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. 58 జీవోను త్వరలోనే అమలుచేసి పేదలందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు. డంపింగ్ యార్డ్ నుంచి దుర్గంధం రాకుండా రూ.147కోట్లతో గ్రీన్ క్యాపింగ్ చేసినట్లు చెప్పారు.
 
పట్టణాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రూ.487 కోట్ల వ్యయంతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేశామని అన్నారు. మేడ్చల్ జిల్లాలో 3 దశల్లో 50వేల నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పిన మంత్రి.. మరో రూ.308 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ లోని 50 పడకల ఆస్పత్రిని 100 పడకల హాస్పిటల్ గా తీర్చుదిద్దుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.