మీరు వాడి మమ్మల్ని చెడ్డోళ్లను చేస్తున్నారు : KTR

మీరు వాడి మమ్మల్ని చెడ్డోళ్లను చేస్తున్నారు : KTR

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత , జౌళి శాఖ అధికారులతో ఎమ్మెల్యే కేటీఆర్ రివ్యూ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మీటింగ్ కావడంతో.. ప్రభుత్వ సిబ్బంది… ఆ గదిలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పెట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్.. ఆ వాటర్ బాటిళ్లను తీసేయించారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను చూసిన ఆయన.. వాటిని తన చేతుల్లోకి తీసుకుని.. వెనక్కి ఇచ్చేశాడు.  అక్కడే ఉన్న మహిళా అధికారితో ఈ విషయం చెప్పి.. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను అందరూ తీసేయాల్సిందిగా వారికి సూచించారు. అందరూ తమ ముందున్న వాటర్ బాటిళ్లను సిబ్బందికి ఇచ్చేశారు. ప్లాస్టిక్ ను ఎంకరేజ్ చేయొద్దని సూచించారు.

అధికారులను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. “ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఎంకరేజ్ చేయకండి. మీరు ప్లాస్టిక్ బాటిళ్లను వాడి మమ్మల్ని చెడ్డోళ్లను చేస్తున్నారు. మండల స్థాయి, గ్రామస్థాయి అందరికీ చెప్పండి. ప్లాస్టిక్ ను ఎంకరేజ్ చేయొద్దు. ఎవరో చేశారని మిగతావాళ్లు కూడా అదే చేయడం రైటా.. అందరికీ చెప్పండి.. ప్లాస్టిక్ బాటిళ్లు వాడకుండా చూసే బాధ్యత మీదే” అని కేటీఆర్ అధికారులకు చెప్పారు.