హైదరాబాద్ లో కేటీఆర్​కు హార్వర్డ్ ఆహ్వానం

హైదరాబాద్ లో కేటీఆర్​కు హార్వర్డ్ ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు :  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి18న వర్సిటీలో నిర్వహించే 21వ ఇండియా కాన్ఫరెన్స్‌‌ లో పాల్గొని ప్రసంగించాలని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు బుధవారం ఆయనకు ఇన్విటేషన్ అందజేశారు.

ఈ కాన్ఫరెన్స్‌‌లో విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపార ప్రముఖులు, విధాన నిర్ణేతలు, ప్రవాస భారతీయులు పాల్గొననున్నారు.