డ్రగ్స్ మాఫియాతో కేటీఆర్ కు సంబంధం

డ్రగ్స్ మాఫియాతో కేటీఆర్ కు సంబంధం

బంగారు తెలంగాణ అని గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంగా మారుస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. అర్ధరాత్రి 3గంటల వరకు పబ్ లు నడుస్తుంటే.. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాకు కేటీఆర్ కు సంబంధం ఉందన్నారు. టీఆర్ఎస్ నేతలే డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్. రేట్లు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.

మరిన్ని వార్తల కోసం..

పబ్‎లో ప్రముఖులు.. లైవ్ అప్‎డేట్స్

డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్