నిరాధార ఆరోపణలు చేస్తున్న .. యూట్యూబ్ చానళ్లపై లీగల్ యాక్షన్ : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నిరాధార ఆరోపణలు చేస్తున్న .. యూట్యూబ్ చానళ్లపై లీగల్ యాక్షన్ : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • పరువు నష్టం దావా వేస్తాం
  • బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్చరిక
  • తప్పుదోవ పట్టించేలా థంబ్​నెయిల్స్​ పెడుతున్నరని మండిపాటు

హైదరాబాద్, వెలుగు: తమపై, తమ పార్టీపై నిరాధార, అసత్య ఆరోపణలు చేసే యూట్యూబ్ చానళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఆధారాలు లేకుండా  అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి యూట్యూబ్ చానళ్లపైన కఠినమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.

వీటిపై పరువు నష్టం దావాలతోపాటు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు క్రిమినల్ కేసులను కూడా నమోదయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్​ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో పచ్చి అబద్ధాలను యూట్యూబ్ చానల్స్‌‌‌‌‌‌‌‌ చూపిస్తున్నాయని మండిపడ్డారు. గుడ్డి వ్యతిరేకతతోనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.

వ్యక్తిగతంగా తనతోపాటు తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే  ఇదంతా జరుగుతున్నట్టుగా భావిస్తున్నామని చెప్పారు.  గతంలో తమపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ చానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు.

దీంతోపాటు ఆయా చానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కు అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే.. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని  హెచ్చరించారు. ఇలాంటి కుట్రపూరిత చానళ్ల ప్రాపగండ, అసత్య ప్రచారంపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.