పీజేఆర్​కు ఘన నివాళి

పీజేఆర్​కు ఘన నివాళి

ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్​ సీనియర్ నేత  పి.జనార్దన్​ రెడ్డి16వ వర్ధంతి సందర్భంగా ​ఖైరతాబాద్ ​చౌరస్తాలోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్​వర్కింగ్​  ప్రెసిడెంట్​ కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. పీజేఆర్ ​తనయుడు విష్ణువర్ధన్​రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్​, మాజీ హోంమంత్రి మహమూద్​అలీ, మేయర్​గద్వాల విజయలక్ష్మి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్​తదితరులు పాల్గొని పీజేఆర్​ సేవలను కొనియాడారు.

  ఐమాక్స్ థియేటర్ వద్ద పీజేఆర్ వర్ధంతిని కుమార్తె విజయా రెడ్డి నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, కురుమ యాదవ సంఘం నేత చిన్న శ్రీశైలం యాదవ్ , కాంగ్రెస్ నేతలు పాల్గొని  పీజేఆర్ చేసిన సేవలను కొనియాడారు.