అది వైట్​ పేపర్ ​కాదు.. అబద్ధాల డాక్యుమెంట్ : కేటీఆర్

అది వైట్​ పేపర్ ​కాదు.. అబద్ధాల డాక్యుమెంట్ : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్​ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది వైట్​పేపర్ కాదని.. అబద్ధాలతో కూడిన డాక్యుమెంట్​అని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  తప్పుడు సమాచారంతో ప్రాపగండ చేయడంపైనే ప్రభుత్వం ఫోకస్ ​చేసిందని ట్వీట్ చేశారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఇలాంటి  అసెంబ్లీ వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గు చేటని కేటీఆర్ విమర్శించారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వైట్​పేపర్​ఉందన్నారు. వృథా ఖర్చులు చేయమని చెప్తోన్న కొత్త సీఎం.. ఎంసీఆర్​హెచ్ఆర్డీలో సీఎం క్యాంప్​ఆఫీస్, ఢిల్లీలో తెలంగాణ భవన్​నిర్మించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. 100 రోజుల్లో కాంగ్రెస్​గ్యారంటీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని, ఇందుకు కౌంట్​డౌన్​మొదలైందని కేటీఆర్ పేర్కొన్నారు.