‘పట్టణ ప్రగతి’ విజయవంతమైందన్న కేటీఆర్

‘పట్టణ ప్రగతి’ విజయవంతమైందన్న కేటీఆర్

పట్టణాల మార్పే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైందన్నారు రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. శుక్రవారం మర్రిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో పట్టణ ప్రగతి కార్యక్రమం తొలి అడుగు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం కోసం పని చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి, వివిధ శాఖల ఉద్యోగులకు పురపాలక శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగిన తీరుపైన జిల్లాల వారిగా అడిషనల్ కలెక్టర్లతో మాట్లాడారు. పట్టణాలను అదర్శ పట్టణాలుగా మార్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా నూతన మున్సిపల్ చట్టంపైన ప్రజల్లో అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయం సాధించిందని అన్నారు.