కేసీఆర్ వస్తే.. కాంగ్రెస్ కు సినిమా మొదలైతది: కేటీఆర్

 కేసీఆర్ వస్తే.. కాంగ్రెస్ కు సినిమా మొదలైతది: కేటీఆర్

ఎన్నికల్లో ఎదురు దెబ్బలు..  గెలుపులు సహజమని, ఓడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనవరి 12వ తేదీ శుక్రవారం నగరంలోని తెలంగాణ భవన్ లో భవనగిరి లోక్ సభ స్థానంపై ఆయన సమీక్ష నిర్వహించారు.  

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే, కళ్లు లేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యహారిస్తుందని ఫైర్ అయ్యారు.  ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయిందని, కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి దిగితే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పారు.  కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనని.. అమలు చేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420  హామీలు అమలు చేసేంత వరకు పోరాటం చేయాలని నేతలకు కేటీఆర్ సూచించారు.