జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఏడాదికి మోడీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి రాష్ట్ర నేతలకు లేదన్నారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందని ఆరోపించారు. జర్నలిస్టులకు అండగా ఉంటామన్నారు. త్వరలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు కేటీఆర్. జలవిహార్ లో జరిగిన జర్నలిస్ట్ ప్రతినిధుల సభకు కేటీఆర్ హాజరయ్యారు.