లక్ష విగ్రహాలను ఉచితంగా అందిస్తం: కేటీఆర్

లక్ష విగ్రహాలను ఉచితంగా అందిస్తం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : ప్రతి ఏడాది మాదిరిగానే ఈ వినాయక చవితికి సైతం లక్ష మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్​ వైస్ చైర్మన్​  వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్​రాజుతో కలిసి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా 4 రోజుల పాటు  విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. జంట నగరాల్లోలోని 40 కేంద్రాల్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వీటిని అందజేస్తామన్నారు. అనంతరం సెక్రటేరియట్ లో సీఎస్ శాంతికుమారికి వినాయక ప్రతిమను అర్వింద్ కుమార్ అందజేశారు.

17 వరకు  గ్రేటర్​లో మట్టి విగ్రహాల పంపిణీ

వినాయక చవితి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఓ  ప్రకటనలో తెలిపారు. వార్డుకు 2,500 చొప్పున ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.