సోనూసూద్‌ మాత్రమే సూపర్ హీరో

సోనూసూద్‌ మాత్రమే సూపర్ హీరో

యాక్టర్ సోనూసూద్‌ను సూపర్ హీరో అంటూ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నంద కిషోర్ అనే వ్యక్తి తాను రిక్వెస్ట్ చేసిన పది గంటల్లోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపినందుకు మంత్రి KTRకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేటీఆర్‌ను సూపర్, రియల్ హీరో అంటూ ట్వీట్‌లో పొగిడారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్... ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తున్నానని... సూపర్ హీరో అంటే సోనూసూద్ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. కాగా.. కేటీఆర్ ట్వీట్‌పై యాక్టర్ సోనూసూద్ స్పందించారు. సూపర్ హీరోగా పోల్చినందుకు KTRకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా KTRపైనా సోనూసూద్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ కోసం ఎంతో చేస్తున్నారని, మీ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని సోనూ అన్నారు. తెలంగాణ తనకు సెకండ్ హోమ్‌గా మారిందని, అక్కడి ప్రజలు తనపై ఎన్నో ఏళ్లుగా ప్రేమ చూపిస్తున్నారంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచారంటూ ట్వీట్ చేశారు.