దేశ జీడీపీలో తెలంగాణది నాల్గో స్థానం

దేశ జీడీపీలో తెలంగాణది నాల్గో స్థానం

ప్రపంచంలోని ఐదు పెద్ద కంపెనీలు హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. 7 శాతం ఉఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి తెలంగాణలోనే అవుతోందన్నారు. ఐటీ వృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ హెచ్‌సీయూలో జరిగిన సెకండ్ ఐసీటీ పాలసీ 2021-2026 ను ప్రారంభించారు కేటీఆర్. ఎలక్ట్రానిక్స్ లో రూ.70వేల కోట్లు పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.ఈ విషయంలో కంపెనీలన్నీ ముందుకు రావాలన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు.  రెండో శ్రేణి నగరాల వరకు ఐటీని విస్తరిస్తామన్నారు కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన నుంచి ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయన్నారు.