జిమ్ లో తీవ్రంగా గాయపడ్డ కేటీఆర్.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

జిమ్ లో తీవ్రంగా గాయపడ్డ కేటీఆర్.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు తీవ్ర గాయమయ్యింది. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా.. వెన్నుముకకు గాయమయ్యింది. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయమయ్యిందని.. కొద్దిరోజులు బెడ్ రెస్ట్ తీసుకొమ్మని డాక్టర్లు సూచించారని ట్వీట్ లో పేర్కొన్నారు కేటీఆర్.

కొద్దిరోజుల బెడ్ రెస్ట్ తర్వాత తన కాళ్లపై తాను నిలబడి.. తిరిగి వస్తానని ట్వీట్ చేశారు కేటీఆర్. కాగా.. తమ నాయకుడు గాయపడటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని..కామెంట్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆదివారం ( ఏప్రిల్ 27 ) వరంగల్ సభలో యాక్టివ్ గా పాల్గొన్న తమ నేత ఇంతలోనే గాయపడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.