
నిజామాబాద్ ఎంపీ, తన చెల్లెలు కవిత ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం గడిపే అవకాశం ఆ దేవుడు అందించాలని.. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆకాంక్షించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ లో కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కేటీఆర్ ఓ పోస్ట్ చేశారు. ఎనర్జీ పవర్ హౌజ్, డైనమిజానికి మారుపేరు అయిన కవిత.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంతోషం, ప్రశాంతతతో నిండిన జీవితాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ఆయన విష్ చేశారు.