కూకట్ పల్లి ఎమ్మెల్యేకు నిరసన సెగ

కూకట్ పల్లి ఎమ్మెల్యేకు నిరసన సెగ
  •     బీఆర్ఎస్ ​హయాంలోనే భూములను 22ఏ జాబితాలో చేర్చారని ఆగ్రహం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి బీఆర్ఎస్​ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆయన బాలానగర్​, ఫతేనగర్​డివిజన్లలో పర్యటనకు వెళ్లిన సమయంలో పలు కాలనీలు, బస్తీల వాసులు కాంగ్రెస్​ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. హ్యాట్రిక్​ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న కృష్ణారావు బాలానగర్, ఫతేనగర్ డివిజన్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్​హయాంలోనే పలు కాలనీలు, భూములను 22ఏ జాబితాలో చేర్చి ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో మరోసారి తమను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్​నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు వచ్చి, వారిని ఠాణాకు తరలించారు.