కూకట్‌పల్లి, వెలుగు: కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటనలో నిందితుడిని పోలీసులు ఒక రోజులోనే అరెస్ట్ చేశారు. ఈ వివరాలను బాలానగర్ ఏసీపీ నరేశ్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు. ప్రగతినగర్‌కు చెందిన డాక్టర్ కిరణ్ శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు వచ్చాడు.
కుటుంబ సభ్యులు షాపింగ్ చేస్తుండగా కిరణ్ బయట వాకింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి కిరణ్‌ను ఢీకొట్టి, అతని మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూసాపేటకు చెందిన సతీశ్(27)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
