ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా చివరి రెండు మ్యాచ్ లకు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. నవంబర్ 14 నుంచి ఇండియా- సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం ఈ స్టార్ స్పిన్నర్ ను ఇండియా టీ20 జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇండియా ఎ, సౌతాఫ్రికా ఎ జట్ల మధ్య జరగబోయే రెండో అనధికారిక టెస్ట్ లో కుల్దీప్ ఆడనున్నాడు. రెండో టెస్ట్ నవంబర్ 6 నుంచి 9 మధ్య బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతుంది. సౌతాఫ్రికాతో సిరీస్ కు ముందు ఈ మ్యాచ్ ఈ లెఫ్టర్మ్ స్పిన్నర్ కు ప్రాక్టీస్ గా ఉంటుంది.
"బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సౌతాఫ్రికా ఏ తో జరిగే రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడడం కోసం.. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 సిరీస్ నుండి కుల్దీప్ యాదవ్‌ను విడుదల చేయాలని భారత జట్టు యాజమాన్యం రిక్వెస్ట్ చేసింది. రెండవ నాలుగు రోజుల మ్యాచ్ నవంబర్ 6న ప్రారంభమవుతుంది ". అని బీసీసీఐ ఆదివారం (నవంబర్ 2) ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో కుల్దీప్ 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. కుల్దీప్ స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. జట్టులో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, సుందర్ ఉన్నారు.
ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం (నవంబర్ 2) జరిగితే ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయంసాధించి 1-1 తో సమం చేసింది. నవంబర్ 6 న నాలుగో టీ20, నవంబర్ 8న చివరిదైన ఐదో టీ20 జరుగుతుంది.
ఆస్ట్రేలియాతో నాలుగు, ఐదు టీ20లకు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్ ), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకుతోన్ సింగ్, వాషింగ్ సుందర్,
దక్షిణాఫ్రికా 'ఎ' తో జరిగే రెండో టెస్ట్ కు భారత 'ఎ' జట్టు:
రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ దే బ్రర్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్
