- భువనగిరి ఎమ్మెల్యే కుంభం
యాదాద్రి, వెలుగు : మెగా జాబ్‌మేళా ద్వారా కనీసం 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 8 నుంచి 10 వరకూ కుంభం ఫౌండేషన్, '1ఎం 1బీ' సంస్థ కలసి మెగాజాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. 20కి పైగాపెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు.
10వ తరగతి నుంచి ఇంజినీరింగ్ ఆపై చదువులు చదివిన వారందరూ పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 12 వేల నుంచి రూ. 40 వేల వరకు వేతనం ఉంటుందని వెల్లడించారు. చదువు అయిపోయిన తర్వాత కొంతకాలం ఖాళీగా ఉన్నా కంపెనీలు తీసుకోవని చెప్పారు. వచ్చిన అవకాశాలు అందింపుచ్చుకుంటేనే భవిష్యత్‌లో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని, అందుకు యువత సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జాబ్‌మేళ పోస్టర్ రిలీజ్ చేశారు.

