కార్మికులపైకి దూసుకెళ్లిన రైలు 11 మంది మృతి.. చైనాలో ఘోర ప్రమాదం

కార్మికులపైకి దూసుకెళ్లిన రైలు 11 మంది మృతి.. చైనాలో ఘోర ప్రమాదం

బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది. ట్రాక్ నిర్వహణ బృందంపైకి రైలు దూసుకెళ్లడంతో 11 మంది కార్మికులు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నైరుతి చైనా యునాన్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌ లోని కున్మింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున భూకంప గుర్తింపు వ్యవస్థలను పరీక్షించడానికి లుయోయాంగ్ జెన్ స్టేషన్ లో రైలును టెస్ట్ రన్ చేస్తున్నారు. ఆ సమయంలో  రైలు పట్టాల వద్ద పని చేస్తున్నవారిపైకి ట్రైన్ దూసుకెళ్లింది. 

ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, ఇద్దరు గాయపడ్డారని చైనా రైల్వే కున్మింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్ తెలిపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇది చైనాలో గత దశాబ్దాంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదమని ఆ దేశ రైల్వే అధికారులు అభివర్ణించారు.