కుంటాల, పొచ్చర జలపాతాల పరవళ్లు

కుంటాల, పొచ్చర జలపాతాల పరవళ్లు

తెలంగాణలో పేరు గాంచిన నేరడిగొండ మండలం కుంటాల, బోథ్​ మండలం పొచ్చర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. రెండు రోజులుగా ఎగువన కురిసిన వర్షాలకు వరద పోటెత్తడంతో జలపాతాలు సందడి చేస్తున్నాయి. వీటి అందాలను తిలకించేందుకు ఆదివారం తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర నుంచి పర్యాటకులు కుటుంబాలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. జలపాతాల అందాలను చూస్తూ సెల్ఫీలు తీసుకుంటూ.. స్నానాలు చేస్తూ సందడి చేశారు.


వెలుగు ఫొటో గ్రాఫర్, ఆదిలాబాద్