గొల్లల వల్ల కురుమలకు నష్టం.. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్

గొల్లల వల్ల కురుమలకు నష్టం.. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
  •  కురుమ యువ చైతన్య వేదిక   అధ్యక్షుడు వెంకటేశ్

పంజాగుట్ట, వెలుగు: గొల్లలతో సంబంధం లేకుండా ప్రత్యేక కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై ప్రతిష్ఠించాలని కురుమ యువ చైతన్య వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో వేదిక అధ్యక్షుడు వెంకటేశ్​కురుమ మాట్లాడారు. గతంలో గొల్లలతో కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎక్కువగా గొల్లలకే అందుతున్నాయని, కురుమలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

 బీసీ–ఏలో ఉన్న కురుమలను బీసీ–డీలో ఉన్న గొల్లలతో కలపడం వల్ల కురుమలు సామాజికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కురుమలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల కాపర్లుగా జీవిస్తూ, ఏడాదిలో కొన్ని నెలలు కుటుంబాలకు దూరంగా అడవుల్లో జీవనం సాగిస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.