ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం దారుణం... కరీంనగర్ రాజకీయాలను సంజయ్ చెడగొడుతున్నరు: ఎల్. రమణ

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం దారుణం... కరీంనగర్ రాజకీయాలను సంజయ్ చెడగొడుతున్నరు: ఎల్. రమణ

హైదరాబాద్, వెలుగు: బండి సంజయ్ అనుచరు లు కరీంనగర్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసుపై పట్టపగలు దాడి చేశారని, ప్రభుత్వ ఆస్తులను కేంద్ర మంత్రి సంజయ్​ మనుషులు ధ్వంసం చేయడం దారుణమని బీఆర్ఎస్​ ఎల్పీ డిప్యూటీ లీడర్​ఎల్. రమణ అన్నారు. కేటీఆర్​పై బజారు భాషను వాడడమే కాకుండా.. ప్రశాంతంగా ఉండే కరీంనగర్​ రాజకీయాలను సంజయ్​ చెడగొడుతున్నారని విమర్శించారు. ధ్వంసానికి పాల్పడిన గూండాలపై పీడీ యాక్ట్​ ప్రయోగించాలని డిమాండ్​ చేశారు. గురువారం ఆయన ఎమ్మెల్యే సంజయ్​తో కలిసి తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. 

బాధ్యులను వెంటనే అరెస్ట్​ చేయాలన్నారు. సంజయ్​కు చట్టాల మీద ఏమాత్రం నమ్మకమున్నా తన గూండాలను పోలీసులకు అప్పగించాలన్నారు. శాంతిభద్రతల బాధ్యతలు చూడాల్సిన బండి సంజయ్​.. ప్రభుత్వ ఆఫీసు అయిన ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసుపై దాడి చేయించారని ఎమ్మెల్యే సంజయ్​ అన్నారు. సంజయ్​ వ్యవహారాన్ని ప్రధాని మోదీ గమనించాలన్నారు. చదువు, సంధ్య లేని బండి సంజయ్​.. మాట్లాడే తెలివి లేక దాడి చేయించారన్నారు. ఇక్కడ హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కలిసి మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.