
2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే TG LAWCET-2025, లా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి లాసెట్ TG PGLCET-2025 అడ్మిషన్లకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శుక్రవారం(జూలై 25, 2025న) విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) ఆధ్వర్యంలో జరిగిన అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
లాసెట్, పీజీ లా సెట్-2025:
లాసెట్-2025 కు సంబంధించి జూలై 26న లా సెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 4 నుంచి 14 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, ఆగస్టు 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 22న సీట్ల కేటాయిపు, ఆగస్టు 22 నుంచి 25 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం కల్పించారు. ఇక పీజీ లాసెట్ (TG PGLCET-2025) అడ్మిషన్ల కోసం ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, సెప్టెంబర్ 3,4 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, సెప్టెంబర్ 8న సీట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 9 నుంచి 13 వరతకు సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం కల్పించారు.
పిజి ఈసెట్2025
జూలై 26న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 1 నుంచి 9 వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది. ఆగస్టు 10,12 తేదీలలో పీజీ ఈ సెట్ మొదటి విడత వెబ్ ఆప్షన్లు అవకాశం ఉండగా ఆగస్టు 16న పీజీఈ సెట్ సీట్ సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 18 నుంచి 21 వరకు కాలేజీలల్లో విద్యార్థులు రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.
►ALSO READ | Hyderabad IIT Jobs: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు భర్తీ
లా కోర్సులలో ప్రవేశం పొందాలనుకుంటున్న విద్యార్థులు ఈ షెడ్యూల్‌ను గమనించాలని సూచించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడతాయి. అభ్యర్థులు తరచుగా వెబ్‌సైట్‌ను సందర్శించి తాజా సమాచారం కోసం అప్‌డేట్‌గా ఉండాలని కోరారు.