వెన్నుపోటు ఈవెంట్ :  కడపలో లక్ష్మీస్ NTR ఆడియో

వెన్నుపోటు ఈవెంట్ :  కడపలో లక్ష్మీస్ NTR ఆడియో

లక్ష్మీస్ NTR సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ… మరో ఇంట్రస్టింగ్ మ్యాటర్ చెప్పారు. ఈ సినిమా ఆడియో వేడుకను.. కడప పట్టణంలో నిర్వహిస్తామని ప్రకటించారు. కడపలో ఆడియో రిలీజ్ కోసం భారీ బహిరంగ సభ పెడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి “వెన్నుపోటు ఈవెంట్” అలియాస్ ‘ఎన్టీఆర్ నైట్’ అని పేరు పెట్టారు. ఏ రోజు నిర్వహిస్తామన్నది అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు వర్మ.

లక్ష్మీస్ NTR సినిమాను మార్చి 22న రిలీజ్ చేస్తామని ఇప్పటికే వర్మ ప్రకటించారు. ఐతే.. మూవీ విడుదలను వాయిదావేయాలని టీడీపీ నేతలు ఈసీకి కంప్లయింట్ చేశారు. దీనిపై ఇంకా ఈసీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరోవైపు… రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో… సినిమా మేకర్స్ ప్రమోషన్ ను స్పీడప్ చేస్తున్నారు.