మాజీ ఐఏఎస్ ఇంట్లో ఎలక్షన్స్ స్క్వాడ్ సోదాలు

మాజీ ఐఏఎస్ ఇంట్లో ఎలక్షన్స్ స్క్వాడ్ సోదాలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లో ఎలక్షన్స్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నాయి. మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏకే గోయల్ ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. 

ఏకే గోయల్ ఇంట్లో భారీగా డబ్బు డంపు చేశారని సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ టీమ్,  ఎలక్షన్స్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నాయి. ఏకే గోయల్ ఇంట్లో భారీగా డబ్బు డంప్ చేశారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి .. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. డబ్బుతో ఓట్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. 2010లో పదవీ విరమణ పొందిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుడుగా పనిచేశారు ఏకే గోయల్. 

మరోవైపు..  తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ వేళ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇటు ఎలక్షన్స్ అధికారులు కూడా ప్రలోభాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.