
హాంకాంగ్ ఓపెన్ సూపర్–500లో ఇండియా ఆశలు మిగిలే ఉన్నాయి. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్య సేన్ సెమీ ఫైనల్ కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఇండియాకు చెందిన సహచర ప్లేయర్ ఆయుష్ శెట్టిపై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి సెమీస్ కు దూసుకెళ్లాడు. శుక్రవారం (సెప్టెంబర్ 12) హోరాహోరీగా జరిగిన జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 21-16, 17-21, 21-13 తేడాతో ఆయుష్ శెట్టిపై గెలిచాడు. అంతకముందు రౌండ్ ఆఫ్ 16 లో ఇండియా ప్లేయర్ న ఓడించిన లక్ష్య సేన్ సెమీస్ లో కూడా ఇండియా ప్లేయర్ పై నెగ్గడం గమనార్హం.
హోరాహోరీగా జరిగిన తొలి గేమ్ లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. కీలక సమయంలో లక్ష్య సేన్ పాయింట్లు గెలుచుకోవడంతో తొలి సెట్ ను 21-16 తేడాతో గెలుచుకున్నాడు. రెండో సెట్ లో కూడా ఇద్దరూ అద్భుతంగా పోరాడారు. అయితే ఈ సారి ఆయుష్ శెట్టి 21-17 తేడాతో గేమ్ గెలిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ లో లక్ష్య సేన్ ఆట ముందు ఆయుష్ నిలవలేకపోయాడు. దీంతో 21-13 తేడాతో లక్ష్య సేన్ గేమ్ గెలిచాడు. సెమీస్ లో లక్ష్య సేన్ మూడవ సీడ్ చౌ టీన్ చెన్, అల్వి ఫర్హాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో తలపడతాడు.
►ALSO READ | Shubman Gill: అతను మా నాన్నకు ఫేవరేట్.. కోహ్లీ కంటే ముందు అతడే నా క్రికెట్ ఐడల్: శుభమాన్ గిల్
గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ ఆయుష్ 21–19, 12–21, 21–14తో వరల్డ్ రెండో ర్యాంకర్ కొడాయ్ నరోకా షాక్ ఇచ్చి (జపాన్) క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్స్ లో కూడా అదే జోరు చూపించినా లక్ష్య సేన్ అనుభవం ముందు తలవంచక తప్పలేదు. డబుల్స్ లో ఇండియా జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీస్ లోకి అడుగుపెట్టారు. ఈ జోడీ మలేషియా ద్వయం యాప్ రాయ్ కింగ్, జునైది ఆరిఫ్‌పై 21-14, 20-22, 21-16 తేడాతో మూడు సెట్లలో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు.
LAKSHYA SEN INTO THE SF OF THE HONG KONG OPEN
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) September 12, 2025
Lakshya defeated compatriot Ayush Shetty 21-16, 17-21, 21-13 in the QF to reach his 1st SF of Super 500 event this year
👏👏👏👏 pic.twitter.com/IyRilnGEoR