
భారత క్రికెట్ లో యువ బ్యాటర్ శుభమాన్ గిల్ దూసుకొస్తున్నాడు. సచిన్, కోహ్లీ తర్వాత సరైన బ్యాటింగ్ వారసుడిగా ఇండియన్ క్రికెట్ టీమ్ ను ముందుకు తీసుకెళ్లనున్నాడు. ఓ వైపు కెప్టెన్ గా, మరోవైపు బ్యాటర్ గా గిల్ అంతర్జాతీయ క్రికెట్ లో మోస్ట్ బిజీయెస్ట్ క్రికెటర్ గా గిల్ మారనున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్ లు ఆడుతున్నాడు. ఆసియా కప్ లో వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడంతో ఫ్యూచర్ లో అన్ని ఫార్మాట్లకు గిల్ కెప్టెన్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఫ్యూచర్ స్టార్ గా మారిన గిల్.. తన కెరీర్ ను ప్రభావితం చేసిన ఇద్దరు పేర్లు చెప్పాడు. సచిన్, కోహ్లీ తనకు క్రికెటింగ్ ఐడల్స్ గా చెప్పుకొచ్చాడు.
గిల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఇలా అన్నాడు. " నాకు ఇద్దరు క్రికెట్ ఐడల్ లు ఉన్నారు. మొదటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఆయన నాన్నగారికి ఇష్టమైన వ్యక్తి. నిజానికి నేను ఆయన వల్లే క్రికెట్‌లోకి వచ్చాను. సచిన్ 2013లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2011–2013 మధ్య నేను క్రికెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం ప్రారంభించాను. కేవలం స్కిల్స్ మాత్రమే కాకుండా ఆటలోని మెంటల్ ఎబిలిటీ.. సరైన అవగాహన అంటే ఏంటో తెలుసుకున్నాను.
►ALSO READ | Asia Cup 2025: ఒమన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
"2011-2013లో నేను విరాట్ కోహ్లీని ఫాలో అవుతూ వచ్చాను. అతను తన క్రికెట్ కెరీర్ లో ఎలా ముందుకు సాగాడో ఆట పట్ల అతనికి ఉన్న ఆసక్తి, గెలవాలనే కసి నాపై చాలా ప్రభావం చూపించాయి. మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ పరుగులు చేయాలి.. గెలవాలనే కసి విరాట్ కు ఎక్కువగా ఉంటుంది. ఆదే నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది". అని శుభమాన్ గిల్ ఆపిల్ మ్యూజిక్ పాడ్‌కాస్ట్‌లో అన్నాడు.
ప్రస్తుతం గిల్ ఆసియా కప్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. గిల్ ఇప్పటివరకు 37 టెస్ట్ ల్లో తొమ్మిది సెంచరీలు.. ఏడు అర్ధ సెంచరీలతో 2647 పరుగులు చేశాడు. సగటు 41.35 కాగా హైయెస్ట్ స్కోర్ 269. వన్డేల్లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. 55 వన్డేల్లో 59 యావరేజ్ తో 2775 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు ఉన్నాయి. వీటిలో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. 22 టీ20ల్లో స్ట్రైక్ రేట్ 141.03తో 598 పరుగులు చేశాడు.