
ఆసియా కప్ లో పాకిస్థాన్, ఒమన్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 12) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్-ఏ లో ఇరు జట్లకు ఇదే టోర్నీ తొలి మ్యాచ్. పాకిస్థాన్ ఈ మ్యాచ్ లో భారీ విజయంపై కన్నేసింది. "గత 2-3 నెలలుగా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాము. జట్టు సమిష్టిగా రాణిస్తోంది. ఇదే ఫామ్ కొనసాగించాలనుకుంటున్నాం. మాకు ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు.. ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నారు. మొదటగా బ్యాటింగ్ చేసి బిగ్ టోటల్ బోర్డుపై ఉంచాలనుకుంటున్నాం". అని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ తర్వాత అన్నాడు.
మరోవైపు ఈ మ్యాచ్ లో పాక్ కు షాక్ ఇచ్చి ఒమన్ సంచలన విజయం సాధించాలని ఆరాటపడుతోంది. " టాస్ గెలిస్తే మేము ముందుగా బ్యాటింగ్ చేసేవాళ్ళం. ఆసియా దిగ్గజాలతో కలిసి పోటీ పడటం మాకు ఒక చారిత్రాత్మక క్షణం. మా కుర్రాళ్ళు మంచి ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు". అని ఒమన్ కెప్టెన్ జితేందర్ సింగ్ టాస్ తర్వాత చెప్పుకొచ్చాడు.
ఒమన్ (ప్లేయింగ్ XI):
జతీందర్ సింగ్ (కెప్టెన్), అమీర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, హస్నేన్ షా, మహ్మద్ నదీమ్, జిక్రియా ఇస్లాం, సుఫ్యాన్ మెహమూద్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):
సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.
►ALSO READ | Duleep Trophy 2025: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ.. వెస్టిండీస్ సిరీస్‌కు ఇండియా జట్టులో పటిదార్