Duleep Trophy 2025: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ.. వెస్టిండీస్ సిరీస్‌కు ఇండియా జట్టులో పటిదార్‌

Duleep Trophy 2025: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ.. వెస్టిండీస్ సిరీస్‌కు ఇండియా జట్టులో పటిదార్‌

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్.. టీమిండియా బ్యాటర్ రజత్ పటిదార్ టీమిండియా టెస్ట్ జట్టులో మళ్ళీ అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేలవ ఫామ్ తో టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయిన పటిదార్.. దేశవాళీ లో ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో నిలకడగా పరుగులు చేసిన ఈ మధ్య ప్రదేశ్ స్టార్ బ్యాటర్ దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో అదరగొట్టాడు. సెంట్రల్ జోన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పటిదార్.. 115 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.  

ఈ టోర్నీలో RCB కెప్టెన్ కు ఇది రెండో సెంచరీ కాగా.. మరో రెండు హాఫ్ సెంచరీలు అతని ఖాతలో ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ ల్లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేయగా.. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 191 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సెమీ ఫైనల్లో 77 పరుగులతో సత్తా చాటడంతో పాటు ఫైనల్లోనూ అదే ఫామ్ ను కొనసాగిస్తూ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కేవలం నాలుగు ఇన్నింగ్స్‌లలో 369 పరుగులు చేసి 2025 దులీప్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 

దులీప్ ట్రోఫీ లాంటి కఠిన టోర్నీలో నిలకడగా రాణించడంతో పటిదార్ కు వెస్టిండీస్ తో జరగబోయే రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ లో టీమిండియాపై 2024 లో ఇంగ్లాండ్ పై తొలిసారి అవకాశం దక్కించుకున్న పటిదార్.. పేవల ఫామ్ తో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కేవలం 63 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దులీప్ ట్రోఫీతో మళ్ళీ తన ఫామ్ నిరూపించుకోవడంతో ఆసియా కప్ తర్వాత వెస్టిండీస్ తో స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్ కు రీ ఎంట్రీ ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. 

►ALSO READ | IND vs PAK: బుమ్రా ఓవర్‌లో మా ప్లేయర్ 6 బంతులకు 6 సిక్సర్లు కొడతాడు: పాక్ మాజీ ఓవరాక్షన్

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా మిడిలార్డర్ బలహీనంగా మారింది. పంత్ వెస్టిండీస్ తో సిరీస్ కు అందుబాటులో లేకపోతే పటిదార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. ఇక దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే   పటిదార్ (101) పాటు యష్ రాథోడ్ (137*) సెంచరీ చేయడంతో సెంట్రల్ జోన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసి భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. ప్రస్తుతం సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో సౌత్ జోన్ కేవలం 149 పరుగులకు మాత్రమే ఆలౌట్ అయింది. 

దులీప్ ట్రోఫీ చివరి నాలుగు ఇన్నింగ్స్ ల్లో పటిదార్ పెర్ఫామెన్స్: 

- క్వార్టర్ ఫైనల్‌లో 125(96).
- క్వార్టర్ ఫైనల్‌లో 66(72).
- సెమీ ఫైనల్‌లో 77(84).
- ఫైనల్‌లో 101(115).