
ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య మరో హై-వోల్టేజ్ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 14) జరగనుంది. ఇప్పటికే ఆసియా కప్ లో ఇండియా యూఏఈపై భారీ విజయం సాధించగా.. పాకిస్థాన్ శుక్రవారం (సెప్టెంబర్ 12) ఒమన్ తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం జరగబోయే మ్యాచ్ ఇరు జట్లకు రెండో మ్యాచ్. గెలిచిన జట్టు సూపర్-4 బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. మ్యాచ్ కు ముందు ఎప్పటిలాగే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ టీమిండియా స్టార్ బౌలర్ పై బోల్డ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
ఆసియా కప్ కు మరో రెండు రోజుల సమయం ఉండగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఇలా అన్నాడు. " 2025 ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదుతాడు". అని సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో స్టార్ బౌలర్ల లిస్టులో బుమ్రా ఉంటాడు. మూడు ఫార్మాట్ లలో నిలకడగా రాణించే అతి కొద్ది మంది బౌలర్లలో బుమ్రా ఒకడు. తన పదునైన యార్కర్లు, స్వింగ్, బౌన్స్ తో ఎంతటి స్టార్ బ్యాటర్ నైనా బోల్తా కొట్టిస్తాడు. ప్రపంచ స్టార్ బ్యాటర్లు సైతం ఈ యార్కర్ల వీరుడిని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడతారు.
ALSO READ : డబ్బు కోసం ఉగ్రవాదులతో మ్యాచ్ అవసరమా..
ఇప్పటికే క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన బుమ్రా..నెంబర్ వన్ బౌలర్ గా కితాబులందుకుంటున్నాడు. బుమ్రా బౌలింగ్ లో ఆడడానికి ఎలాంటి బౌలర్ అయినా తడబడతారు. అయితే పాక్ మాజీ మాత్రం తమ దేశానికి చెందిన యువ క్రికెటర్ బుమ్రా బౌలింగ్ లో 6 బంతులకు ఆరు సిక్సర్లు కొడతాడని షాక్ ఇచ్చాడు. సైమ్ అయూబ్ టాలెంటెడ్ బ్యాటర్ ఇది అసాధ్యం అని నెటిజన్స్ తన్వీర్ ను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు తన్వీర్ అహ్మద్‌ను తీవ్రంగా విమర్శించారు. సొంత దేశమే అతని కామెంట్స్ కు అసంతృప్తి వ్యక్తం చేశాయి.