IND vs PAK: డబ్బు కోసం ఉగ్రవాదులతో మ్యాచ్ అవసరమా.. ఇండియా- పాక్ మ్యాచ్ బహిష్కరించాలని నెటిజన్స్ డిమాండ్

IND vs PAK: డబ్బు కోసం ఉగ్రవాదులతో మ్యాచ్ అవసరమా.. ఇండియా- పాక్ మ్యాచ్ బహిష్కరించాలని నెటిజన్స్ డిమాండ్

ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా దాయాధి జట్లు తలపడనున్నాయి. సాధారణంగా పాకిస్థాన్ తో మ్యాచ్ అనగానే ఇండియన్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ సారి పరిస్థితి భిన్నం. పాకిస్థాన్ తో ఆసియా కప్ లో మ్యాచ్ వద్దని సోషల్ మీడియాలో నెటిజన్స్ భావిస్తున్నారు. ఆసియా కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ను బహిష్కరించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. పహల్గాంలో ఉగ్రదాడికి ప్రేరేపించిన పాకిస్థాన్‎తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని భావిస్తున్నారు. 
  
సోషల్ మీడియాలో ఒక యూజర్ "బీసీసీఐ, ఉగ్రవాదం డబ్బు కోసం ఈ మ్యాచ్‌ను ఆడుతున్నాయా?" అని అడిగారు.  మరొక నెటిజన్  "కొన్ని నెలల క్రితం పహల్గామ్‌లో అమాయక భారతీయ పౌరులను బలిదానం చేసిన దేశంతో ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడగలదు?" అని ప్రశ్నించాడు. ఇంకో నెటిజన్ ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి ఎవరూ సిద్ధంగా లేరని.. అందుకే టికెట్స్ కూడా ఎవరూ కొనడం లేదని చెప్పాడు. ఇలా చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ మ్యాచ్ జరగకూడదని బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు. 

ఆసియా కప్‎లో ఇండియా, పాక్ మ్యాచ్ రద్దు చేయాలని కోరుతూ నలుగురు లా విద్యార్థులు పిల్ సుప్రీంకోర్టును గురువారం (సెప్టెంబర్ 11) ఆశ్రయించారు. ఆసియా కప్‌ 2025లో భాగంగా భారత్ vs పాకిస్తాన్ తలపడనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్)ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‎ను అత్యవసరంగా విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

►ALSO READ | Ashes 2025-26: యాషెస్‌లో అతడు సెంచరీ చేయకపోతే గ్రౌండ్ మొత్తం నగ్నంగా నడుస్తాను: ఆస్ట్రేలియా దిగ్గజం

ఆసియా కప్ కు ముందు భారత ప్రభుత్వం ఇండియా, పాకిస్తాన్‌ మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగవని తేల్చిచెప్పింది. ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి బహుళ పక్ష టోర్నీల్లో మాత్రం పాకిస్థాన్ తో తలపడటానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆసియా కప్ లో పాక్ తో మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ అంగీకరించింది. ఆసియా కప్ లో భాగంగా 2025, సెప్టెంబర్ 14 చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మెగా ఫైట్ కోసం యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.