
ఒడెన్స్: ఇండియా షట్లర్ లక్ష్యసేన్.. డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 10–21, 21–18, 21–18తో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై గెలిచాడు. ఆరంభంలో వెనకబడ్డ లక్ష్య తర్వాతి రెండు గేమ్‌ల్లో తన ట్రేడ్ మార్క్ ఆటతో చెలరేగాడు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 17–21, 21–11, 21–17తో క్రిస్టోఫర్ గ్రిమ్లీ–మాథ్యూ గ్రిమ్లీ (స్కాట్లాండ్)పై నెగ్గారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో మోహిత్ జగ్లాన్–లక్షిత జగ్లాన్ 14–21, 11–21తో అద్నాన్ మౌలానా–ఇందా కాహ్యా సరి జమిల్ (ఇండోనేసియా) చేతిలో ఓడారు. రెండో రౌండ్‌లో లక్ష్యసేన్.. అండెర్స్ అంటోన్‌సెన్ (డెన్మార్క్)తో, సాత్విక్ జోడీ.. లీ జీ హుయి–యాంగ్ పో సుయాన్ (చైనీస్‌తైపీ)తో తలపడనుంది.