ఢిల్లీలో సాధారణ పరిస్థితులు..ఎర్రకోట మెట్రోస్టేషన్ రీఓపెన్

ఢిల్లీలో సాధారణ పరిస్థితులు..ఎర్రకోట మెట్రోస్టేషన్ రీఓపెన్

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్​ తిరిగి ప్రారంభమైంది. ఆదివారం ( నవంబర్​ 16)లాల్​ ఖిలా మెట్రో స్టేషన్​ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తెలిచారు అధికారులు. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు తర్వాత భద్రతా దృష్ట్యా లాల్​ఖిలా మెట్రో స్టేషన్ ను మూసివేశారు. ఆరు రోజులు తర్వాత తిరిగి ఈ రోజు ప్రయాణికులకు మెట్రో సేవలను పునరుద్దరించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషనే (DMRC) తెలిపింది. 

ఎర్రకోట(లాల్​ఖిలా) మెట్రోస్టేషన్​ ఓపెన్ చేయడం కాశ్మీరీ గేట్ నుంచి రాజా నవహర్​సింగ్​ ప్రాంతం వరకు వైలెట్ లైన్​లో ప్రయాణికులకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటుంది. ఎర్రకోట ,పాత ఢిల్లీ ప్రాంతాలకు వెళ్లే రోజువారీ ప్రయాణికులు, పర్యాటకులు ,స్థానిక నివాసితులకు పూర్తి కనెక్టివిటీని ఉంటుందని DMRC తెలిపింది. 

నవంబర్​ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు బ్లాస్ట్​ లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భద్రతా దృష్ట్యా ఎర్రకోట మెట్రో స్టేషన్​ ను డీఎంఆర్​ సీ మూసివేసింది. ఢిల్లీలో శాంతి భద్రతలు తిరిగి నెలకొనడంతో ఈ రోజు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు.