
రజినీకాంత్ కీలకపాత్రలో ఆయన కూతురు ఐశ్వర్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. దీపావళి సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. మంచి క్రికెటర్స్ అయిన హిందూ, ముస్లిం యువకులు మతం పేరుతో గొడవలు పడుతుంటే ఆ గొడవలను మొయిద్దీన్ భాయ్ పాత్ర పోషిస్తున్న రజినీకాంత్ ఎలా సర్దుబాటు చేశారు.
ప్రజల మధ్య ఎలాంటి సఖ్యతను కుదిర్చారు అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్ అని అర్థమ వుతోంది. ‘ఆటలో కూడా మతాన్ని కలుపుతున్నారు. పిల్లల మనసుల్లో కూడా విషాన్ని నింపుతున్నారు’ అంటూ రజినీకాంత్ ఆ ప్రాంతంలో శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.