ఢిల్లీలోని ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ, రబ్రీ దేవిపై అభియోగాలు

ఢిల్లీలోని ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ, రబ్రీ దేవిపై అభియోగాలు

న్యూఢిల్లీ: రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలకు సంబంధించిన (ల్యాండ్​ఫర్​జాబ్) ​సీబీఐ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవిపై అధికారికంగా అభియోగాలు మోపింది. 

అయితే, లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి కోర్టుకు హాజరై ఆరోపణలను తిరస్కరించారు. ట్రయల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నే వారిపై అభియోగాలు మెపారు.