ప్రధానికి భార్య ఉండాలి..లేకపోతే అధికారిక నివాసంలో ఉండొద్దు

 ప్రధానికి భార్య ఉండాలి..లేకపోతే అధికారిక నివాసంలో ఉండొద్దు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి పదవిలోకి ఎవరు వచ్చినా భార్య లేకుండా ఉండొద్దని ఆర్జేడీ చీఫ్​లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. మెడికల్ చెకప్ కోసం గురువారం ఢిల్లీకి బయలుదేరుతున్న సందర్భంగా పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రైమ్ మినిస్టర్ కు భార్య తప్పనిసరిగా ఉండాలి. భార్య లేకుండా ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో ఉండటం తప్పు. ఇలాంటివి ఇకపై జరగరాదు” అని ఆయన కామెంట్ చేశారు. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా పెండ్లి చేసుకోవాలని కొన్ని రోజుల క్రితమే ఆయనకు లాలూ సలహా కూడా ఇచ్చారు. ఈ నెల 17న బెంగళూరులో జరగనున్న ప్రతిపక్ష పార్టీల మీటింగ్ కు తాను కూడా హాజరు కానున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘ఢిల్లీలో మెడికల్ చెకప్ ల కోసం వెళ్తున్నా. తిరిగి పాట్నాకు వస్తాను. ఆ తర్వాత బెంగళూరు వెళ్తాను. ప్రధాని నరేంద్ర మోదీని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గద్దె దింపడం కోసం గ్రౌండ్ ను ప్రిపేర్ చేసేందుకే ప్రతిపక్షాల మీటింగ్ కు వెళ్తా” అని ఆయన చెప్పారు.