
- కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోండి
- కలెక్టర్ కు ఎన్కేపల్లి రైతులు వినతి
వికారాబాద్, వెలుగు : జిల్లాలోని పూడూరు మండలం ఎన్కేపల్లి భూముల్లో భారీ స్కామ్ జరిగిందని, పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని రైతులకు అప్పగించాలని కోరారు. అనంతరం ఎన్కేపల్లి రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి సర్వే నం. 99, 101లో రూ.150 కోట్ల లావాదేవీలు జరిగాయని , ఫేక్ ఆర్మీ సర్టిఫికెట్లు సృష్టించి కొందరు రియల్ఎస్టేట్ మాఫియా పేదల భూమిని ఎకరాకు రూ. 2–10 లక్షల వరకు చెల్లించి కొంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూమిని రూ. కోట్లల్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
దీనిపై కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఫేక్ ఆర్మీ సర్టిఫికెట్లను రద్దుచేసి, భూమిని గ్రామస్తుల ఇండ్ల స్థలాల కోసం కేటాయించి న్యాయం చేయాలని కోరారు. భూమిని అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎన్కేపల్లి భూములను కాపాడాలని కోరారు. రైతుల వద్ద కొత్త భూమి పాస్ బుక్ లు ఉన్నా కూడా వారిని దౌర్జన్యంగా భూముల్లో నుంచి వెళ్లగొట్టి కంచెలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నర్సింలు, చెన్నయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
దీంతో ప్రస్తుత ఇన్‌చార్జ్ తో పాటు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్పొరేషన్(హెచ్ జీసీ)లో సీనియర్ అధికారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం. చివరకు ఈ పోస్టు ఎవరికి దక్కుతుందా..! అనే ఉత్కంఠ నెలకొంది. కమిషనర్ నిర్ణయం మేరకే ప్రభుత్వం కూడా నియామకం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
గత సర్కార్ హయాంలో ఇష్టారాజ్యం
గత సర్కారు హయాంలో పని చేసిన హెచ్ఎండీఏ సీఈలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కీలక ప్రాజెక్టులన్నీ సీఈ నేతృత్వంలోనే జరుగుతుండగా.. అందకే ఈ పోస్టుకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఈగా పనిచేసిన వ్యక్తి స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి చెప్పినట్లుగా ఆయన నడుచుకున్నారని, పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి.
కాంగ్రెస్ సర్కార్ రాగానే కీలక అధికారులను తప్పించినది. ఇక తనను కూడా తొలగించకముందే వెళ్లిపోతానంటూ ఆయన రాజీనామా చేశారు. హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్ కూడా లేక పోవడంతో సీఈ నియామకం కూడా వాయిదా పడుతోంది. తాజాగా కొత్త ఎండీ నియామకంతో త్వరలో పూర్తిస్థాయి సీఈ కూడా రావొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా కొందరు అధికారుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
భారీ ప్రాజెక్టులు చేపట్టనుండగా..
త్వరలో హెచ్ఎండీఏ పలు కీలక ప్రాజెక్టులను చేపట్టనుంది. ఇందులో అత్యంత కీలకమైన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ఉంది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, జేబీఎస్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్లను చేపట్టనుంది. 3,812 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైంది. దాదాపు 60వేల కోట్లతో మూసీ రివర్డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కానుంది.
ఈ రెండు హెచ్ఎండీఏకు ఎంతో కీలకమైనవి. ఇవేకాకుండా సిటీలో స్కైవేలు, ఇతర ప్రాజెక్టులు రానున్నాయి. ఇలాంటప్పుడు యాక్టివ్ సీఈని నియమించాల్సిందేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు. త్వరలోనే సీఈ నియామకం జరుగుతుందని అంటున్నారు. అయితే సీనియారిటీని పరిగణలోకి తీసుకునే నియామకం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే వీటిని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) నిర్వహించి నియమిస్తరా? లేక నేరుగా జరుగుతుందా? అనేది ఆసక్తిగా మారింది.