ఇండస్ట్రీ పెట్టకపోతే భూములు వాపస్

ఇండస్ట్రీ పెట్టకపోతే భూములు వాపస్

మేనేజ్మెంట్లకు షోకాజ్ నోటీసులివ్వండి
అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు సర్కారు నుంచి భూములు తీసుకొని.. గడువు ముగిసినా ఏర్పాటు చేయకుంటే ఆ భూములను వాపస్ తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వెంటనే అలాంటి పరిశ్రమల మేనేజ్మెంట్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం టీఫైబర్ ఆఫీసులో అధికారులతో కేటీఆర్ సమీక్షించారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పేరుతో భూములను పరిశ్రమల పేరిట మార్పిడి చేయించుకొని కార్యకలాపాలు ప్రారంభించని వాటిని గుర్తించి, నోటీసులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల ఇన్ఫర్మేషన్ ఒకే చోట చేర్చి బ్లూబుక్ తయారు చేయాలని.. అన్ని కంపెనీల వివరాలు, ఏ ఇండస్ట్రీ ఏ కేటగిరీకి చెందినది అనే సమగ్ర డేటా ఉండాలని సూచించారు. ఇలా సమగ్ర సమాచారం సర్కారు దగ్గర ఉంటే ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

పొల్యూషన్ ఫ్రీగా ఫార్మాసిటీ
ఫార్మాసిటీని పొల్యూషన్ ఫ్రీగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే విండ్ ఫ్లోను స్టడీ చేశామని.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో యూనిట్ల స్థాపనకు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఫార్మా సిటీ నుంచి వచ్చే వేస్టేజీని శుద్ధిచేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లివ్– వర్క్ – లెర్న్ స్పూర్తితో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని.. అధికారులు, ఉద్యోగులు అక్కడే నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దానికి అనుబంధంగా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, ఇతర విభాగాలు ఏర్పడుతాయన్నారు. స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అందుకోసం ట్రైనింగ్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన త్వరగా పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలని కేటీఆర్ ఆదేశించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ రూపొందించిన ఈఎస్ఎఫ్సీ డిజిటల్ ఫ్లాట్ ఫాంను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

For More News..

పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా

ఆర్టీసీ ఉద్యోగులకు ఫ్రీగా కరోనా కిట్లు

దేశంలో తొలి సోలార్‌‌రూఫ్‌కు పేటెంట్

ఒకే వ్యక్తికి మూడు నెలల్లో రెండోసారి కరోనా