సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత

సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత

భారతదేశపు లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) తుదిశ్వాస విడిచారు. జనవరి 8న కరోనాతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆమె.. ఈ ఉదయం 8:12 గంటలకు కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆమె మృతదేహాన్ని ముంబైలోని శివాజీ పార్క్‌లో ఉంచనున్నారు.

కరోనాతో మూడు వారాల పాటు ఐసీయూలో ఉన్న లతా మంగేష్కర్ చివరకు కోలుకోలేకపోయారు. ఆమెకు కరోనా సోకిన తర్వాత న్యుమోనియా కూడా ఎటాక్ అయింది. లతా మంగేష్కర్ మరణం భారతీయ సంగీతానికి భారీ శూన్యతను మిగిల్చింది. ఆమె మృతితో దేశ సినీరంగం దిగ్భ్రాంతికి గురైంది. లతా మంగేష్కర్ కు ముగ్గురు సోదరీమణులు ఉషా మంగేష్కర్, ఆశా భోంస్లే, మీనా ఖాదికర్ మరియు సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఉన్నారు. లతా సెప్టెంబర్ 28, 1928న ఇండోర్‎లో జన్మించారు. 

గానకోకిల గురించి మరింతగా..

  • లతా 1942లో 13 ఏళ్ల వయసులో తొలి పాట పాడింది. 
  • 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
  • 2001లో భారతరత్న ఆమె సొంతం.
  • పద్మభూషణ్, పద్మవిభూషణ్ అందుకున్నారు.
  • ఇప్పటివరకు 980 సినిమాలకు పాటలు పాడారు.
  • వివిధ భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడారు.
  • 36కి పైగా భారతీయ మరియు విదేశీ భాషలలో పాటలు పాడారు.
  • తెలుగులో మూడు పాటలు మాత్రమే పాడిన లత.
  • 1947లో మాజ్ బూర్ చిత్రంతో గాయనిగా ప్రస్థానం మొదలుపెట్టారు.
  • భారత గానకోకిలగా లతకు గుర్తింపు.
  • తెలుగులో 1995లో నాగేశ్వరావు నటించిన సంతానం సినిమాలో నిదుర పోరా తమ్ముడా పాట.
  • 1965లో ఎన్టీఆర్ నటించిన దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట. 
  • 1988లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీరకు పాట. 
  • లతా మంగేష్కర్ రాజ్యసభ ఎంపీగాను పనిచేశారు. (నవంబర్ 22, 1999 నుంచి నవంబర్ 21, 2005 వరకు) 
  • లత 13 ఏళ్ల వయసులోనే ఆమె తండ్రి గుండె వ్యాధితో మరణించారు. 
  • గురువు అమాన్ అలీఖాన్ వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 
  • గాయనిగా 7 దశాబ్దాలకు పైగా కొనసాగారు. 
  • 170 మంది సంగీత దర్శకుల వద్ద పాటలు పాడిన ఘనత ఆమెకే దక్కింది.
  • ఛత్రపతి శివాజీ, అనార్కలీ సినిమాలతో మంచి గుర్తింపు.