Good News : మీ వయస్సు 45 ఏళ్లు అయినా పర్వాలేదు.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఈ ఉద్యోగాలు మీ కోసం.. !

Good News : మీ వయస్సు 45 ఏళ్లు అయినా పర్వాలేదు.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఈ ఉద్యోగాలు మీ కోసం.. !

ఏఏఐలో మెంబర్ పోస్టులు 

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ) మెంబర్ క్యాండిడేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 09.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, ఏదైనా మాస్టర్ డిగ్రీ, ఎంబీఏ/ పీజీడీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: కనిష్ట వయో పరిమితి 45 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 60 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జూన్ 09. 

పూర్తి వివరాలకు www.aai.aero.in వెబ్​ సైట్ లో సంప్రదించగలరు. 

వీఎన్ఐటీలోజూనియర్ రీసెర్చ్ ఫెలో 

విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, నాగ్​పూర్(వీఎన్ఐటీ, నాగ్​పూర్) జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో(ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్​) 02, జూనియర్ రీసెర్చ్ ఫెలో(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) 02, ప్రాజెక్ట్ అసోసియేట్ 01. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో  బి.ఆర్కిటెక్చర్, బీటెక్ లేదా బీఈ, ఎంఈ లేదా ఎంటెక్, బి.ప్లానింగ్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

లాస్ట్ డేట్: జూన్ 13. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్ 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

పూర్తి వివరాలకు www.vnit.ac.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.