యోగి 100 రోజుల పాలనలో 525 ఎన్ కౌంటర్లు 

యోగి 100 రోజుల పాలనలో 525 ఎన్ కౌంటర్లు 

రెండో టర్మ్​లో యోగి సర్కార్ మరింత దూకుడు   

లక్నో: యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చి సోమవారం నాటికి 100 రోజులు అయింది. ఈ ఏడాది మార్చి 25న యోగి రెండో సారి యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ వంద రోజుల్లో యోగి ఉచిత రేషన్ పంపిణీతో పాటు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించారు. శాంతి భద్రతపై ఫోకస్ మరింత పెంచారు. గ్యాంగ్ స్టర్ చట్టం కింద లోకల్ మాఫియాలకు చెందిన రూ. 200 కోట్ల విలువైన 582కు పైగా అక్రమాస్తులను సీజ్ చేశారు. వంద రోజుల్లో 525 ఎన్​కౌంటర్లు జరగ్గా ఐదుగురు గ్యాంగ్​స్టర్లు హతమయ్యారు. 425 మంది క్రిమినల్స్ గాయపడ్డారు. 68 మంది పోలీసులకూ గాయాలయ్యాయి.1,034 మంది క్రిమినల్స్ ను అరెస్టు చేశారు.