షారుఖ్ కొడుకు కేసు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

షారుఖ్ కొడుకు కేసు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌‌కు ముంబై కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆర్యన్‌‌తో పాటు అరెస్ట్ అయిన అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాల బెయిల్ పిటిషన్‌‌ను కూడా రిజెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ కేసును వాదిస్తున్న ప్రముఖ లాయర్ సతీష్ మాన్‌షిండే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముంబైలోని స్పెషల్ ఎన్‌డీపీఎస్ కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సోమవారం జరగాల్సిన ఈ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆర్యన్‌తోపాటు ఇతరుల బెయిల్ పిటిషన్లు కూడా వాయిదా పడ్డాయి.