ఎల్బీనగర్, వెలుగు: యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తహసీల్దార్ పి. వేణుగోపాల్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేళాలో ఐటీ, హెల్త్, ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్ సహా వివిధ రంగాలకు చెందిన దాదాపు 162 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. ఇంటర్, డిప్లమా, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు.
ఆసక్తి గల అభ్యర్థులు https://satg.telangana.gov.in/prajapalana/ వెబ్ లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.
