
గాంధీజీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ప్రముఖలు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , ప్రధానమంత్రి మోడీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖలు రాజ్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు.
"ఈ గాంధీ జయంతి(153) మరింత ప్రత్యేకమైనది. దేశమొత్తం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేయండి... అదే గాంధీజికి నిజమైన నివాళి" ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
నేడు లాల్ బహుదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయం మ్యూజియంలోని కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మ్యూజియాన్ని సందర్శించాలని కోరారు.
రాజ్ ఘాట్ లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ, మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు పలువురు నేతలు గాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ పోరాట ఘట్టాలను గుర్తు చేశారు. మరోవైపు జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ… కర్ణాటకలో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.