ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బావి వద్ద చెప్పులు వదిలి అజ్ఞాతంలోకి

ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బావి వద్ద చెప్పులు వదిలి అజ్ఞాతంలోకి

కుటుంబం ఆత్మహత్యలో ట్విస్ట్

కుమురంభీం జిల్లా: భార్యా పిల్లలతో కలసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్యా.. కుమార్తెలను ప్రాణహితలో కి దూకమని ప్రేరేపించి.. వారు దూకేశాక.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బావి వద్ద చెప్పులు వదిలి అందర్నీ నమ్మించాడు ఈ నయవంచకుడు. అయితే బావిలో ఎంత వెతికినా మృతదేహం దొరక్కపోవడంతో భార్యా పిల్లలను మోసం చేసిన నయవంచకుడి ఘాతుకం వెలుగులోకి వచ్చింది.

చింతలమానేపల్లి మండలం బూరేపల్లిలో శుక్రవారం రోజున  ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. భార్య శ్యామల, కూతురు ప్రాణహితలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో.. తాను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు  నమ్మించాడు భర్త నాగరాజు.  బావి గట్టున చెప్పులు వదిలి  అందులో దూకినట్టు అందరిని నమ్మించిన నాగరాజు భార్య, కూతురు, మృతి చెందడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బావిలో గాని.. ప్రాణహితలో గాని ఎంత వెదికినా నాగరాజు మృతదేహం దొరక్కపోవడంతో అతను చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.