లెక్చరర్లు రెగ్యులర్​గా కాలేజీలకు రావాల్సిందే

లెక్చరర్లు రెగ్యులర్​గా కాలేజీలకు రావాల్సిందే

ఇంటర్ బోర్డు సెక్రటరీ ఆదేశం


 సర్కారు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు, సిబ్బంది రెగ్యులర్​గా కాలేజీలకు రావాల్సిందేనని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆర్జేడీలు, డీఐఈఓలకు ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న టీశాట్, దూరదర్శన్ చానళ్లలో వస్తున్న క్లాసులపై పిల్లలకు డౌట్స్ వస్తే వాట్సాప్, జూమ్ వీడియో కాల్స్ ద్వారా క్లారిఫై చేయాలని, వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని  లెక్చరర్లకు సూచించారు. సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లకు టీచర్లకు మాత్రం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం స్కూళ్లకు బంద్ ప్రకటించడంతో పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. టీచర్లు మాత్రం బడులకు వెళ్లి వస్తున్నారు.