డబుల్​ బెడ్​రూం ఇండ్లను అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్​ భవేశ్​మిశ్రా

డబుల్​ బెడ్​రూం ఇండ్లను అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్​ భవేశ్​మిశ్రా

భూపాలపల్లి అర్భన్​ , వెలుగు :  డబుల్​ బెడ్​రూం ఇండ్లను లబ్ధిదారులు వేరేవారికి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్​భూపాలపల్లి  కలెక్టర్​ భవేశ్​​ మిశ్రా హెచ్చరించారు. మంచి నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా  భూపాలపల్లి మండల పరిధిలోని వెలిశాలపల్లి లో డబుల్​ బెడ్​రూం  ఇండ్లను  పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్,  మున్సిపల్  ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు.  

అనంతరం  కలెక్టర్ కాలనీలోని నీటి ట్యాంక్ లను పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ   ఒక కుటుంబం అద్దె ఇంట్లో ఉంటే కనీసం 2 వేల  నుంచి 3 వేలు అద్దె చెల్లించాల్సి వస్తుందని అది  సంవత్సరానికి దాదాపు 30 వేలు అవుతుందని,  అద్దె కట్టలేని  పేదలను కోసం  డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించామని  కలెక్టర్ అన్నారు.  కేటాయించిన  ఇళ్లను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  

కాలనీలో  ఏదేని సమస్యలు వస్తే కుటుంబానికి మీ పరిధిలో నిర్వహణకు చర్యలు చేపట్టాలని అన్నారు.  కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డీఈ వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమిషనర్ రాజేశ్వర్, ఏఈ రోజా  తదితరులు పాల్గొన్నారు.