టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు..సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్స్పష్టత ఇవ్వని వీసీకే పార్టీ

టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు..సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్స్పష్టత ఇవ్వని వీసీకే పార్టీ

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ 108 స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌‌కు మరో 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అయితే, ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం ఆ పార్టీకి సవాల్​గా మారింది. 2 స్థానాల్లో విజయం సాధించిన విదుతలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) మద్దతును విజయ్ కోరారు. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు తొల్ తిరుమావళవన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు, వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), ఇండి యన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు ఆర్.చెల్లస్వామి, లత, సీపీఐ ఎమ్మెల్యేలు టి.రామచంద్రన్, మారిముత్తు, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు సయ్యద్ ఫరూక్ బాషా, ఏఎం.షాజహాన్ బుధవారం అన్నా అరివాలయంలో డీఎంకే అధినేత స్టాలిన్‌‌ను కలిశారు. తమ మద్దతు డీఎంకేకే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లోవిజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మిగతా సీట్లను ఎక్కడి నుంచి సేకరిస్తారనేది తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.